Vishakha Sarada Peetham: ఏపీ సర్కారు కోసం మహాయజ్ఞం: స్వామి స్వరూపానంద

  • విళంబిలో ఏపీ సర్కారుకు అనిశ్చితి
  • దూరం చేసేందుకు యజ్ఞం చేస్తాం
  • త్వరలోనే చంద్రబాబుతో చర్చిస్తాం
  • విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద

విళంబి నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అనిశ్చితి తప్పదని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద జోస్యం చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ అనిశ్చితిని దూరం చేసేందుకు తాను ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టినట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కొన్ని చిక్కులు తప్పకపోవచ్చని అభిప్రాయపడిన ఆయన, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చిక్కులను దూరం చేసుకోవచ్చని అన్నారు. త్వరలోనే తాను చంద్రబాబును కలిసి, చేయాల్సిన యజ్ఞం గురించి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

Vishakha Sarada Peetham
Swaroopananda
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News