Nimmakayala Chinarajappa: వైసీపీ నెలరోజులుగా ప్రకటిస్తున్నా... ఆ పార్టీని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వసించలేదు: చిన రాజప్ప

  • మేము పెడుతోన్న అవిశ్వాస తీర్మానికి దేశ వ్యాప్తంగా మద్దతు
  • ఏపీ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి దేశం మొత్తం తెలిసింది
  • మోదీ నిరంకుశంగా పాలిస్తున్నారు

భారతీయ జనతా పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా, కాకినాడలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో తాము పెడుతోన్న అవిశ్వాస తీర్మానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని అన్నారు. తాము చేస్తోన్న పోరాటం ద్వారా ఏపీ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి దేశం మొత్తం తెలిసిందని తెలిపారు.

మరోవైపు అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ నెలరోజులుగా చెబుతూనే ఉందని, అయినప్పటికీ ఆ పార్టీని ప్రజలతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విశ్వసించలేదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంకుశంగా పాలన కొనసాగిస్తున్నారని, రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని అన్నారు. ఏపీ అభివృద్ధే ధ్యేయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Nimmakayala Chinarajappa
Andhra Pradesh
no confidence motion
  • Loading...

More Telugu News