manmohan singh: ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఉన్న పేరు చెడిపోతోంది: మ‌న్మోహ‌న్ సింగ్

  • పాక్, చైనాల పట్ల మోదీ విధానాలపై మ‌న్మోహ‌న్ విమ‌ర్శ‌లు
  • జమ్ముకశ్మీర్‌ వివాదాన్ని మోదీ స‌ర్కారు తప్పుదోవ పట్టిస్తోంది
  • ఆ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి

పొరుగు దేశాలు పాకిస్థాన్‌, చైనాల పట్ల భారత ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ స‌ర్కారు అనుసరిస్తోన్న విధానాలపై మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీలో రెండో రోజు జరుగుతోన్న‌ కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న మ‌న్మోహ‌న్ సింగ్ మాట్లాడుతూ... జమ్ముకశ్మీర్‌ వివాదాన్ని మోదీ స‌ర్కారు తప్పుదోవ పట్టిస్తోందని, ఆ రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని విమ‌ర్శించారు. మన సరిహద్దు ప్రాంతాలు సురక్షితంగా లేవని అర్థమవుతోందని, ఎన్డీఏ స‌ర్కారు విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఉన్న పేరు చెడిపోతోందని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ఎన్నిక‌ల ముందు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమ‌ర్శించారు.
 
కాగా, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ గురించి మ‌న్మోహ‌న్ సింగ్ మాట్లాడుతూ... పదేళ్ల యూపీఏ పాలనలో సోనియా గాంధీ మార్గదర్శకాలే త‌న‌కు బలాన్ని ఇచ్చాయని, అందుకు ఆమెకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News