amith shah: ఎన్డీఏకు 300 మందికిపైగా ఎంపీల మద్దతు: 'అవిశ్వాసం'పై అమిత్ షా
- అవిశ్వాస తీర్మానాన్ని తేలికగా ఓడిస్తాం
- ఓటింగ్‌కు వెళ్లినప్పటికీ నెగ్గదని అన్ని పార్టీలకు తెలుసు
- అందుకే సభ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి
- వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది
ఎన్డీఏకు 300 మందికిపైగా ఎంపీల మద్దతు ఉందని, కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము తేలికగా ఓడిస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంటుందని, అది ఓటింగ్ కు వెళ్లినప్పటికీ నెగ్గదని అన్ని పార్టీలకు తెలుసని ఆయన అన్నారు.
అందుకే సభ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని అమిత్ షా చెప్పుకొచ్చారు. మోదీ ఒకవైపు, ప్రతిపక్షాలన్నీ కలిపితే మరోవైపు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పోరే ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ విందు సమావేశాలు జరుపుతుందని, కానీ తాము నేరుగా ప్రజలతోనే మమేకమవుతామని అమిత్ షా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు కలలు కంటున్నారని, అయితే అవి నిజం కాదని అన్నారు.