amarnath reddy: అందుకే, చంద్రబాబుపై మోదీ కక్ష సాధింపు: ఏపీ మంత్రి అమరనాథరెడ్డి

  • చంద్రబాబు నాయుడే తనకు పోటీ అని మోదీ భావించారు
  • ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది
  • గుజరాత్‌ను ఏపీ మించిపోతుందేమోనని మోదీ భయం

ప్రధాని నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అమరనాథరెడ్డి విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో అమరనాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశంలో తనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే పోటీ అని భావించిన మోదీ.. చంద్రబాబు, ఏపీపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. గుజరాత్‌ను ఏపీ మించిపోతుందేమోనని మోదీ భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు తమిళనాడులో తమ పార్టీకి పట్టులేకున్నా కల్పించుకుని రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ఏపీలోనూ అదే విధంగా రాజకీయాలు చేయాలంటే కుదరదని అమరనాథ్‌రెడ్డి తెలిపారు. తాము బీజేపీకి ఎదురు తిరగడంతో కేంద్ర సర్కారు తీవ్ర పరిణామాలను ఎదుర్కుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలసి రాకుండా వైసీపీ, జనసేనలు కేంద్ర సర్కారుకి అనుకూలంగా ఉంటున్నాయని ఆరోపించారు.

amarnath reddy
Narendra Modi
Special Category Status
Chandrababu
  • Loading...

More Telugu News