Y S Rajasekhar Reddy: వైఎస్ఆర్ బయోపిక్‌లో తమిళ హీరో సూర్య....?

  • జగన్ పాత్రలో సూర్య..?
  • వైఎస్ పాత్రలో మమ్ముట్టి, విజయమ్మ పాత్రలో నయనతార...!
  • విజయ్ జల్ల, శశిదేవర్ రెడ్డి సంయుక్త నిర్మాణం 

దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గురించి చాలాకాలంగా వార్తలు వినబడుతున్నాయి. నిజానికి ఆయన మరణించిన కొద్దిరోజులకే ఈ విషయం తెరపైకి వచ్చింది. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తానని అప్పట్లోనే సంచలన ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ ప్రాజెక్టు ఊసే ఎత్తకపోవడం గమనార్హం. వైఎస్ జీవితచరిత్రకు వెండితెర రూపం తీసుకురావాలనే వార్తలు ఈ మధ్యకాలంలో మళ్లీ తెరపైకి వచ్చాయి. వైఎస్ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని, ఆయన సతీమణి విజయమ్మ పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ నయనతారను అప్రోచ్ అయినట్లు సమాచారం.

ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై చాలాకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. ఆ పాత్ర కోసం తమిళ హీరో సూర్యను సంప్రదించినట్లు తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. జగన్‌కి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీకి సూర్య అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడమే కాక జగన్ పాదయాత్ర హిట్ అవ్వాలంటూ సూర్య ఇటీవల శుభాకాంక్షలు తెలపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాత్రను సూర్య పోషించవచ్చనే వార్తలు మరింత బలపడుతున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టును విజయ్ జల్ల, శశిదేవర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.

Y S Rajasekhar Reddy
YS Jagan
Mammootty
Vijayamma
Suriya Sivakumar
  • Loading...

More Telugu News