samala pavani: కమీషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల మునిసిపల్ చైర్‌ పర్సన్ పావని రాజీనామా

  • కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటే తప్పేంటన్న సిరిసిల్ల చైర్ పర్సన్ పావని
  • నోరు జారడంతో పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి
  • గత రాత్రి రాజీనామా చేసిన సామల పావని

వివిధ అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటే తప్పేంటని వ్యాఖ్యానించిన  సిరిసిల్ల మునిసిపల్ చైర్‌ పర్సన్ సామల పావని గత రాత్రి తన పదవికి రాజీనామా సమర్పించారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో మునిసిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లతో కలిసి వెళ్ళిన ఆమె, కమిషనర్ కు తన రాజీనామాను అందించారు. నిన్న మున్సిపల్ బడ్జెట్ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కమీషన్ల వ్యవహారంలో ఆమె నోరు జారడంతో పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

 కాగా, తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని పావని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలలో సిరిసిల్ల పట్టణ అభివృద్ధిలో తనను భాగస్వాములు చేసి, తనకు సహకరించిన మంత్రి కేటీఆర్ కు, సహచర మునిసిపల్ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తన రాజీనామా పత్రంలో ఆమె పేర్కొన్నారు.

samala pavani
Rajanna Sircilla District
Commission
  • Loading...

More Telugu News