Sridevi: విద్యాబాలన్‌తో శ్రీదేవి బయోపిక్: బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా

  • గతంలో శ్రీదేవితో సినిమా తీయలేకపోయానని ఆవేదన
  • వెండితెరపై మరో శ్రీదేవి రాలేదని ప్రకటన
  • శ్రీదేవి ఆఖరి చిత్రం 'మామ్'

దక్షిణాది శృంగార తార సిల్క్ స్మిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'డర్టీ పిక్చర్‌' సినిమాలో నటించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్‌ తీసే అవకాశముందని బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా ఓ అంగ్ల దినపత్రికతో అన్నారు. శ్రీదేవి బతికున్నప్పుడు ఆమెతో సినిమా కోసం ఓ కథను సిద్ధం చేశానని, అయితే అది సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. వెండితెరపై మరో శ్రీదేవి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అందువల్ల ఇప్పుడు సరైన నటి తనకు దొరికితే సినిమా చేసి దానిని శ్రీదేవికే అంకితం చేస్తానని మెహతా అన్నారు. ఆమె జీవితంపై తాను కచ్చితంగా ఓ సినిమా చేయగలనని, ఇందుకోసం తన మదిలో కొందరు హీరోయిన్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా తన భార్యపై లఘుచిత్రం తీసే యోచనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆయన ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించినట్లు సమాచారం. కాగా, శ్రీదేవి చివరిసారిగా "మామ్‌' చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే.

Sridevi
Bollywood
Boney kapoor
Hansal mehta
  • Loading...

More Telugu News