amith shah: బీజేపీ, వైసీపీ పొత్తుకు రంగం సిద్ధం?.. అమిత్ షాను కలిసిన జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

  • ఢిల్లీలో కీలక పరిణామం
  • బీజేపీ చీఫ్ తో పీకే భేటీ
  • ఏపీ బీజేపీ నేతలతో భేటీ సమయంలో పీకే ఎంట్రీ

ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, వైసీపీలు కలవబోతున్న సంకేతాలు కనబడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వైసీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయిన సమయంలోనే... ప్రశాంత్ కిశోర్ ను కూడా అమిత్ పిలిపించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా వైసీపీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ వివరించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి హరిబాబు, పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు. 

amith shah
prasanth kishore
  • Loading...

More Telugu News