John Bailey: ఆస్కార్ అవార్డుల చీఫ్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు

  • అకాడమీకి అందిన మూడు ఫిర్యాదులు
  • ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తామన్న అకాడమీ సభ్యులు
  • అంత వరకు వివరాలను వెల్లడించలేమన్న అకాడమీ

ఆస్కార్ అవార్డుల ప్రెసిడెంట్ జాన్ బెయిలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై మూడు ఫిర్యాదులు అందాయి. దీనిపై అకాడమీ సభ్యులు స్పందిస్తూ... ఫిర్యాదుల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తామని చెప్పారు. అకాడమీ నియమ నిబంధనల ప్రకారం ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తామని... ఆ తర్వాత గవర్నర్ల బోర్డుకు సమర్పిస్తామని తెలిపారు. సమీక్ష మొత్తం పూర్తయ్యేంత వరకు దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వలేమని స్పష్టం చేశారు. హాలీవుడ్ లో గొప్ప సినిమాటోగ్రాఫర్ గా పేరున్న జాన్ బెయిలీ గత ఆగస్టులో అకాడమీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 

John Bailey
Academy of Motion Picture Arts and Sciences
President
sexual harassment
  • Loading...

More Telugu News