Jagan: జగన్ లాంటి వాళ్లను చైనాలో అయితే ఉరి తీసేవారు: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • ఆర్థిక నేరస్తులను మోదీ ఎలా కలుస్తారు?
  • మోదీ, అమిత్ షాలది సామ్రాజ్య విస్తరణ కాంక్ష
  • మోదీ-పవన్-జగన్ ల మధ్య ట్రయాంగ్యులర్ స్టోరీ నడుస్తోంది

జగన్ లాంటి అవినీతిపరుడిని చైనాలో అయితే బహిరంగంగా ఉరి తీసేవారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరస్తులను ప్రధాని మోదీ ఎలా కలుస్తారని ప్రశ్నించారు. మోదీ అనుసరిస్తున్న విధానాలు అనైతికమని అన్నారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో మోదీ, అమిత్ షాలు ముందుకు వెళుతున్నారని విమర్శించారు. బీజేపీ అండతో టీడీపీ గెలవలేదని... మోదీ, పవన్ కల్యాణ్ లను కలవక ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే ఘన విజయం సాధించిందని చెప్పారు. మోదీ-పవన్-జగన్ ల మధ్య ట్రయాంగ్యులర్ స్టోరీ నడుస్తోందని అన్నారు. 

Jagan
Narendra Modi
amit shah
rajendra prasad
  • Loading...

More Telugu News