venkatesh: తేజ సినిమా కోసం 15 కేజీలు తగ్గనున్న నారా రోహిత్

  • తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే'
  • వెంకటేశ్ బావమరిది పాత్రలో నారా రోహిత్ 
  • ఒక కథానాయికగా అదితీరావు

ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నారా రోహిత్ నటనలో పరిణతిని సాధిస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథైతే చాలు .. మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' చేయడానికి అంగీకరించాడు. తేజ దర్శకత్వంలో మల్టీస్టారర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ నటిస్తుండగా .. మరో హీరోగా నారా రోహిత్ కనిపించనున్నాడు.

ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో బావ - బావమరుదులుగా కనిపించనున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం బాగా బరువు తగ్గాలని రోహిత్ కి తేజ చెప్పాడట. దాంతో బాగా కసరత్తులు చేసిన రోహిత్ 10 కేజీల వరకూ బరువు తగ్గాడట. మరో 5 కేజీల వరకూ తగ్గాలని తేజ అనడంతో .. ప్రస్తుతం రోహిత్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. ఇక ఒక కథానాయికగా అదితీరావును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News