big boss: తెలుగు 'బిగ్‌బాస్- 2'కి హోస్ట్‌ని ఫైనల్ చేశారట!

- స్టార్ మా టీవీలో తెలుగు బిగ్‌బాస్
- సీజన్ -1కి వ్యాఖ్యాతగా సినీనటుడు జూ.ఎన్టీఆర్
- యువనటుడు నానిని సీజన్-2కి హోస్ట్‌గా ఖరారు చేసినట్లు సమాచారం
స్టార్ మా టీవీలో ప్రసారమైన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -1కి వ్యాఖ్యాతగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో బిగ్‌బాస్-2 సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు లేకపోవడంతో ఆయన స్థానంలో నేచురల్ స్టార్ నానిని లేక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా, నేచురల్ స్టార్ నానినే బిగ్‌బాస్ సీజన్ 2కి హోస్ట్‌గా ఫైనల్ చేశారని తెలిసింది.
