jitender reddy: టీడీపీ, వైసీపీల అవిశ్వాస తీర్మానాలతో మాకు సంబంధం లేదు: టీఆర్ఎస్

  • విభజన చట్టంలోని హామీలపై మాత్రం పోరాడుతాం
  • తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తోంది
  • తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలతో తమకు సంబంధం లేదని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలపై మాత్రం తాము పోరాడతామని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చకుండా... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాలను మారుస్తుందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అన్నారు.

jitender reddy
no confidence motion
TRS
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News