airport: విమానాశ్రయంలో పోగొట్టుకున్న వస్తువుల కోసం యాప్... సీఐఎస్ఎఫ్ విడుదల
- యాప్ నుంచే నేరుగా ఫిర్యాదుకు వీలు
- వెంటనే స్టాటస్ రిపోర్ట్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
విమానాశ్రయాల్లో వస్తువులు పోగొట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో మరిచిపోవడం సహజం. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు సులభంగా వాటిని పొందే అవకాశం ఉంటే బావుంటుంది. విమానాశ్రయాల భద్రతను చూసే సీఐఎస్ఎఫ్ ఇందుకోసం ఓ యాప్ ను విడుదల చేసింది. మర్చిపోయిన, పోగొట్టుకున్న వస్తువులపై ప్రయాణికులు ఈ యాప్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు.
ఈ యాప్ పేరు లాస్ట్ అండ్ ఫౌండ్. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ‘‘ఈ యాప్ లో ఉన్న ప్రధాన అనుకూలత ప్రయాణికులు నేరుగా ఫిర్యాదు నమోదు చేసి వెంటనే స్టాటస్ రిపోర్ట్ పొందొచ్చు’’ అని సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ హేమెంద్ర సింగ్ తెలిపారు. గతేడాది రూ.50.5 కోట్ల విలువైన వస్తువులను గుర్తించినట్టు చెప్పారు.