Pawan Kalyan: ఏపీలో బీజేపీ పని అయిపోయింది.. లోకేష్ అవినీతి కళ్లకు కనపడుతోంది!: ఎన్డీటీవీతో పవన్ కల్యాణ్

  • బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది
  • ఏపీలో పూర్తి నెగెటివ్ ఇమేజ్ ఉంది
  • బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు

బీజేపీతో కలసి పని చేసే అవకాశమే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ... ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోయిందని... ఏపీలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా నెగెటివ్ గా ఉందని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎవరూ భావించడం లేదని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అవినీతికి పాల్పడినట్టు చేసిన ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు బదులిస్తూ... లోకేష్ అవినీతి బహిరంగంగా కనిపిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును... ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని అన్నారు.

Pawan Kalyan
Chandrababu
Nara Lokesh
ndtv
  • Loading...

More Telugu News