Tamilnadu: హర్రీ అప్! ఈ థియేటర్‌లో సినిమాలు ఫ్రీ.. రేపటితో లాస్ట్!

  • పదేళ్లు మూతపడిన సినిమా హాలు ప్రారంభం 
  • మూడు రోజులపాటు ఉచితంగా సినిమాల ప్రదర్శన
  • ప్రస్తుతం పాత సినిమాలకే పరిమితం

నిజమే.. చెన్నైలోని శివశక్తి థియేటర్లో ఎవరైనా ఎన్ని ఆటలైనా ఉచితంగా చూడొచ్చు. కాకపోతే రేపటి వరకు మాత్రమే ఈ అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంటుంది. చెన్నై సమీపంలోని పడిలో ఉన్న ఈ థియేటర్‌ చాలా కాలంగా మూతపడి ఉంది. దాదాపు పదేళ్లు మూతపడిన ఈ థియేటర్‌ను ఆధునికీకరించి గురువారం తిరిగి ప్రారంభించారు. దీంతో ప్రేక్షకులను తిరిగి ఆకర్షించేందుకు థియేటర్ యాజమాన్యం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

16 తేదీ నుంచి 18 వరకు మూడు రోజులపాటు ఉచితంగా సినిమాలు ప్రదర్శించనున్నట్టు ప్రకటించింది. అందరికీ ఉచితంగా టికెట్లను పంపిణీ చేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈనెల 18 వరకు అందరూ ఉచితంగా తమ థియేటర్‌లో సినిమాలు చూడవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ థియేటర్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్’, ’జుమాంజీ: వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘స్పైడర్ మ్యాన్: హోం కమింగ్’, ‘ది జంగిల్ బుక్’, ‘దంగల్’ సినిమాలను ప్రదర్శిస్తున్నారు.

Tamilnadu
Chennai
Cinema
Free
  • Loading...

More Telugu News