Telugudesam: టీడీపీ మా నెత్తిన పాలుపోసింది.. సంతోషం!: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • మా నుంచి టీడీపీ విడిపోవడం సంతోషంగా ఉంది
  • హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు
  • ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ బయటకు వెళ్లిపోయింది : మాధవ్ విమర్శలు

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. తమ నుంచి విడిపోయిన టీడీపీ మా నెత్తిన పాలు పోసిందంటూ, తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందని విమర్శించారు.

నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీకి ఎంతో చేసినా, ఏమీ చేయలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లుతోందని, వైసీపీతో తాము కుమ్మక్కు కాలేదని అన్నారు. టీడీపీ తమపై కుట్రలు చేస్తోందని, బీజేపీతో పొత్తు పెట్టుకోమని నాడు చెప్పిన చంద్రబాబు, దేశంలో మోదీ హవా ఉండటంతోనే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.

Telugudesam
BJP
mlc madhav
  • Loading...

More Telugu News