balakrishna: బాబాయ్ .. అబ్బాయ్ ల మధ్య పోటీ తప్పదేమో?

  • తేజతో రంగంలోకి బాలకృష్ణ 
  • త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఆర్ 
  • ఇద్దరూ సంక్రాంతి బరిలోకి 

తేజ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఈ నెల 29వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ముగింపు దశకి చేరుకోగా .. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి నుంచీ కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. అందువలన ఆయన ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్స్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుకున్న సమయానికే ఈ సినిమా షూటింగ్ మొదలై వుంటే, దసరాకి విడుదల చేద్దామని అనుకున్నారు గానీ అలా కుదరడంలేదు. ఇంకా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. దాంతో బాబాయ్ .. అబ్బాయ్ ల మధ్య పోటీ తప్పదేమోననే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.      

  • Loading...

More Telugu News