prabhakar chowdary: పవన్ కల్యాణ్ కు నా సత్తా ఏంటో చూపిస్తా: ప్రభాకర్ చౌదరి

  • పవన్ నాపై పోటీ చేయాలనుకుంటే స్వాగతిస్తా
  • పవన్ వెనుక బీజేపీ ఉందనే విషయాన్ని ముందే చెప్పా
  • ఏపీలో చంద్రబాబు తర్వాత ఆయనే అని పవన్ అనుకుంటున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై పోటీ చేయాలనుకుంటే... తాను స్వాగతిస్తానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. ఇదే సమయంలో తన సత్తా ఏంటో పవన్ కు చూపిస్తానని చెప్పారు. అమరావతిలోని అసెంబ్లీ లాబీలో మీడియాతో ఈరోజు ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా... పవన్ కల్యాణ్ మీపై పోటీ చేయబోతున్నారట, నిజమేనా? అంటూ ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకు తానే ప్రత్యామ్నాయం అని పవన్ భావిస్తున్నారని... ఈ కారణంతోనే మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారని ప్రభాకర్ చౌదరి అన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నారనే విషయాన్ని తాను మూడు నెలల క్రితమే చెప్పానని తెలిపారు. 

prabhakar chowdary
Pawan Kalyan
elections
  • Loading...

More Telugu News