Telugudesam: అసమర్థపాలనను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ అబద్ధాలాడుతోంది: జీవీఎల్ నరసింహారావు

  • దూకుడు పెంచుతున్న బీజేపీ
  • టీడీపీపై తీవ్ర విమర్శలు
  • టీడీపీ వైదొలగడం బీజేపీకి అందివచ్చిన అవకాశం

బీజేపీ దూకుడు  పెంచుతోంది. ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని ప్రకటించిన వెంటనే న్యూఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వరుస ట్వీట్లను వదిలారు. ఆ ట్వీట్లలో 'కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసిన తరువాత (ఎన్డీయే నుంచి) వైదొలగాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తన అసమర్థ, నిష్ప్రయోజనకరమైన పరిపాలనను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ అబద్ధాలు చెబుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇది పెద్ద ముప్పు ఏమీ కాదు, ఏపీలో బీజేపీ ఎదగడానికి సకాలంలో అందివచ్చిన అవకాశం' అని ఆయన పేర్కొన్నారు.

Telugudesam
BJP
gvl narasimharao
  • Loading...

More Telugu News