radhika apte: రిటైర్మెంట్ తీసుకోవాల్సిన దర్శకుడు రాంగోపాల్ వర్మే: రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

  • రక్తచరిత్ర సినిమాతో టాలీవుడ్ కు రాధికా ఆప్టేను పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ
  • టాక్ షోలో పాల్గొన్న రాధికా ఆప్టే
  • రాంగోపాల్ వర్మ రిటైర్ అవ్వాలి

రాంగోపాల్ వర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని సినీ నటి రాధికా ఆప్టే తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు రాధికా ఆప్టే సంచలనానికి మారుపేరుగా నిలుస్తుంటుంది. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న రాధికకు, ఇప్పుడున్న నటులు, దర్శకుల్లో ఎవరు రిటైర్ కావాలంటారు? అన్న ప్రశ్న ఎదురైంది.

దీనికి ఏమాత్రం తడుముకోని రాధికా ఆప్టే 'రాంగోపాల్ వర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని' తెలిపింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ‘రక్తచరిత్ర’ సినిమాతో టాలీవుడ్ కు రాధికా ఆప్టేను రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

radhika apte
ramgopal verma
Bollywood
  • Loading...

More Telugu News