Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయంపై నందమూరి హరికృష్ణ స్పందన!

  • చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదే
  • తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టింది
  • రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ స్పందించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే టీడీపీ పుట్టిందని... తెలుగు ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో టీడీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో పోరాడారని అన్నారు.

Chandrababu
nandamuri harikrishna
no confidence motion
Telugudesam
  • Loading...

More Telugu News