Deepika Padukone: విటమిన్ డి3 లోపంతో బాధపడుతున్న దీపికా పదుకొణె

  • 'పద్మావత్' ఘన విజయం తరువాత ఇంటికి పరిమితమైన దీపిక
  • 'పద్మావత్' షూటింగ్ లో నడుం, మెడ నొప్పితో బాధపడిన వైనం 
  • చికిత్స చేసి, విశ్రాంతి తీసుకోమన్న వైద్యులు

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ‘పద్మావత్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనే తీవ్రమైన నడుం, మెడ నొప్పితో దీపిక బాధపడింది. దీంతో వైద్యులను సంప్రదించగా, ఆమె విటమిన్ డి3 లోపంతో బాధపడుతోందని నిర్ధారించిన వైద్యులు, విశ్రాంతి తీసుకుని ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. దీంతో దీపిక చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విశాల్ భరద్వాజ్ రూపొందించే సినిమా ఆలస్యమవుతోందని బాలీవుడ్ సమాచారం. మరోపక్క, విశ్రాంతి తీసుకుంటూనే దీపిక కొత్త కథలను వింటోందని తెలుస్తోంది.

Deepika Padukone
padmavath
take rest
  • Loading...

More Telugu News