Jagan: ప్రతి రోజూ మోదీని విజయసాయిరెడ్డి కలుస్తున్నారు.. కారణం ఇదే!: జేసీ దివాకర్ రెడ్డి

  • జగన్ ను కేసుల నుంచి తప్పించేందుకే
  • అవిశ్వాస తీర్మానం కూడా డ్రామానే
  • లోకేష్ ను పవన్ టార్గెట్ చేయడం వెనుక కుట్ర ఉంది

ప్రధాని నరేంద్ర మోదీని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి రోజూ కలుస్తున్నారని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత జగన్ ను కేసుల నుంచి తప్పించడం కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా డ్రామానే అని ఎద్దేవా చేశారు. ఏపీకి నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెషల్ స్టేటస్ ఇవ్వబోరని స్పష్టం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగుందని చెప్పారు. ఎలాంటి కుట్రనైనా తిప్పి కొట్టే సామర్థ్యం టీడీపీకి ఉందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, జేసీ పైవ్యాఖ్యలు చేశారు. 

Jagan
Vijay Sai Reddy
Pawan Kalyan
Nara Lokesh
jc diwakar reddy
  • Loading...

More Telugu News