surya: ఇద్దరు దర్శకులకు ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన సూర్య

- క్రితం ఏడాది సూర్యకి హిట్ ఇచ్చిన దర్శకుడు హరి
- ఈ ఏడాది సక్సెస్ ను ఇచ్చిన విఘ్నేష్ శివన్
- ఇద్దరికీ చెరో కారును గిఫ్ట్ గా ఇచ్చిన సూర్య
తమిళ అగ్ర కథానాయకుల జాబితాలో సూర్య కనిపిస్తాడు. ఒక వైపున నిర్మాతగానూ .. మరో వైపున హీరోగాను సూర్య చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. తనకి సక్సెస్ ను అందించిన దర్శకులకు ఖరీదైన కానుకలను అందజేయడం సూర్యకు మొదటి నుంచి అలవాటు. అలా తాజాగా ఆయన 'సింగం 3' దర్శకుడు 'హరి'కి .. 'తానా సెరిందా కూట్టమ్' దర్శకుడు విఘ్నేష్ శివన్ కి చెరో కారును కానుకగా ఇచ్చాడు.
