Chandrababu: అమిత్ షాకు ఫోన్ చేసి తన నిర్ణయాన్ని చెప్పేసిన టీడీపీ అధినేత
- ఎన్డీయే నుంచి వైదొలగుతున్నాం
- కన్వీనర్ పదవికి కూడా గుడ్ బై
- అమిత్ షాకు చెప్పేసిన చంద్రబాబు
- ఆయన పేరిట ఓ లేఖ కూడా
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ ఉదయం ఎంపీలతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్టీయే నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, ఆ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పారు. ఎన్డీయే కన్వీనర్ పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్టు స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం చూపుతున్న వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, అమిత్ షా పేరిట ఓ లేఖను పంపామని, అందులో మిగతా విషయాలన్నీ సవివరంగా ప్రస్తావించామని చంద్రబాబు పేర్కొన్నారు. తమ పోలిట్ బ్యూరో సమావేశంలో ఎన్డీయే నుంచి వైదొలగాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని, ఇక పార్టీ నిర్ణయాన్ని తాను పాటించక తప్పదని అమిత్ షాకు ఫోన్ లో చంద్రబాబు వివరించారని తెలుస్తోంది.