poonam kaur: బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు... నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

  • తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫేస్‌బుక్ పోస్టు
  • అన్నీ కాపీ చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన
  • ఆ భగవంతుడు చూస్తున్నాడని హెచ్చరిక

బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ సినీ నటి పూనమ్ కౌర్ చేసిన తాజా పోస్టు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేసిందో తెలియక అభిమానులు ఆలోచనలో పడ్డారు. కాన్సెప్ట్ నుంచి డైలాగ్స్ వరకు అన్నీ కాపీ చేసి అమాయక ప్రజలను ఏమార్చుతున్నారని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వీరిని భగవంతుడు గమనిస్తున్నాడని హెచ్చరించింది. ఎప్పటికైనా నిజం బయటపడుతుందని పేర్కొంది.

‘కాన్సెప్ట్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ మాట మీద ఉండకపోవడం, జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ వేష భాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. 

poonam kaur
Actress
Tollywood
Andhra Pradesh
  • Loading...

More Telugu News