Telangana: ఆ ఇజాలు పోతున్నాయి .. ఇప్పుడున్నది అంబేద్కర్ ఇజమే : కడియం శ్రీహరి

- సికింద్రాబాద్, బొల్లారం, ఆదర్శ నగర్ లో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ
- గాంధీ, నెహ్రూ ఇజాలు, సోషలిజం పోతున్నాయి
- రాజ్యాంగం వల్లే ఈరోజున నేను ఉప ముఖ్యమంత్రిని కాగలిగా
- దళిత సమస్యలపై సహృదయంతో స్పందిస్తున్న కేసీఆర్ : కడియం
గాంధీ, నెహ్రూ ఇజాలు, సోషలిజం పోతున్నాయని, ఇప్పుడున్నది కేవలం అంబేద్కర్ ఇజమేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సికింద్రాబాద్, బొల్లారం, ఆదర్శనగర్ లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలను ఈరోజు ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ రామచంద్రారావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజా గాయకులు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.
