Chandrababu: ప్రజాగ్రహానికి భయపడే చంద్రబాబు హోదా జపం చేస్తున్నారు : వైసీపీ నేత భూమన

  • కేంద్రంపై పెట్టబోయే అవిశ్వాస తీర్మానికి టీడీపీ మద్దతివ్వాలి
  • ప్రత్యేకహోదా నినాదాన్ని నాలుగేళ్లుగా టీడీపీ అణగదొక్కింది
  • మీడియాతో భూమన కరుణాకర్ రెడ్డి

ప్రజాగ్రహానికి భయపడే చంద్రబాబు హోదా జపం చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీకి  చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై తాము పెట్టబోయే అవిశ్వాస తీర్మానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా నినాదాన్ని నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అణగదొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. కేంద్రంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న విషయాన్నిపార్లమెంట్ కార్యదర్శికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం నోటీసును ఆయనకు అందజేశారు.

Chandrababu
bhumana karunakar reddy
  • Loading...

More Telugu News