Narendra Modi: పవన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది: బుద్ధా వెంకన్న

  • మోదీ రాసిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ చదివారు
  • మోదీని ఒక భుజాన, జగన్‌ను మరో భుజాన మోస్తున్నారు
  • దేశంలో నిజాయతీ పరులు ఎవ్వరూ లేరన్నట్లు మాట్లాడుతున్నారు
  • మోదీ, జగన్‌, పవన్ కలిసొచ్చినా 175 స్థానాలు కైవసం చేసుకుంటాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. మోదీ రాసిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ చదివారని విమ‌ర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమలం పార్టీ వైపు మళ్లారని అన్నారు. మోదీని ఒక భుజాన, జగన్‌ను మరో భుజాన మోస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిజాయతీ పరులు ఎవ్వరూ లేరన్నట్లు పవన్ మాట్లాడుతున్నారని, పవన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని మోదీ, వైసీపీ అధినేత‌ జగన్‌, పవన్ కలిసొచ్చి పోటీ చేసినా త‌మ పార్టీ వ‌చ్చే ఎన్ని 175 స్థానాలు కైవసం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

Narendra Modi
budda venkanna
YSRCP
Telugudesam
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News