Kajal Agarwal: ప్రధాని నరేంద్రమోదీ పంపిన లేఖకు స్పందించిన నటి కాజల్ అగర్వాల్... ప్రభుత్వ కార్యక్రమాలకు జేజేలు

  • ప్రేమతో కూడిన మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు
  • మహిళల సాధికారతకు సంపూర్ణ సహకారం అందిస్తా
  • ట్విట్టర్లో స్పందించిన నటీమణి

బహుభాషా నటి కాజల్ అగర్వాల్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు పంపించిన శుభాకాంక్షల సందేశంపై స్పందించారు. ‘‘ఎంతో సమాచారంతో కూడిన మీ లేఖకు, ప్రేమతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. భేటీ బచావో భేటీ పడావో (బీబీబీపీ), జాతీయ పోషకాహార కార్యక్రమం (ఎన్ఎన్ఎం) ఫలితాల పట్ల నిజంగా అభినందిస్తున్నాను. మహిళా సాధికారతకు నా శాయశక్తుల సహకారం అందిస్తాను. ప్రభుత్వ బిల్లులు, పథకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అవి మన వ్యవస్థ నిర్వహణ మెరుగుపరచడంలో పెద్ద మార్పును తీసుకురాగలవని నమ్ముతున్నాను’’ అంటూ కాజల్ అగర్వాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా వివిధ రంగాల్లో శక్తియుక్తులు చాటిన మహిళలను అభినందిస్తూ ప్రధాని మోదీ శుభాకాంక్షలను లేఖలో రూపంలో పంపించారు.

Kajal Agarwal
Prime Minister
Narendra Modi
  • Loading...

More Telugu News