Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడాను.. ఇక జ‌గ‌న్‌తోనే జనసేన: వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్

  • తనపై వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని పవన్ అడిగారు
  • ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శస్తున్నామని చెప్పాను
  • 'టీడీపీతోలేను అవసరమైతే జగన్‌కే మద్దతిస్తా'నని పవన్ చెప్పారు
  • రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతాం

తెలుగుదేశం పార్టీపై పోరాడ‌తామ‌ని నిన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మధ్య పవన్ కల్యాణ్ తో తాను ఫోనులో మాట్లాడాన‌ని వ్యాఖ్యానించారు. తనపై వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప‌వ‌న్ అడిగారని, ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడినందుకే విమర్శస్తున్నానని చెప్పానని అన్నారు.

తాను టీడీపీతోలేనని అవసరమైతే జగన్‌కే మద్దతిస్తానని పవన్ చెప్పారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ, జనసేన కలిసి పోరాటం చేస్తాయని ప్ర‌క‌టించారు. రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతామ‌ని, 100 ఎంపీలు మద్దతిచ్చే అవకాశం ఉందని ఆయ‌న చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానంపై పవన్ కూడా ఇటీవల మాట్లాడారని, ఇతర పార్టీల మద్దతు కూడగడతానని చెప్పారని, ప‌వ‌న్ ఆ పని చేయాలని అన్నారు.    

  • Loading...

More Telugu News