jaleel khan: పవన్ కల్యాణ్ కు జలీల్ ఖాన్ సవాల్!

  • నాపై పవన్ చేసిన ఆరోపణలు అవాస్తవం
  • ఆరోపణలను నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • బీజేపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుర్గగుడి పార్కింగ్ వద్ద తాను డబ్బులు వసూలు చేశానంటూ తనపై చేసిన ఆరోపణలను పవన్ నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే... రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ నుంచి పవన్ ప్యాకేజ్ తీసుకున్నారని... అందుకు అకస్మాత్తుగా వైఖరిని మార్చుకున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సభ అంటే... ప్రత్యేక హోదాపై గట్టి పోరాటం చేస్తారని అందరూ భావించారని... అయితే, అసలైన పనిని వదిలేసి, పసలేని ఆరోపణలు చేసి, సభను ముగించారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ గురించి పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. జనసేన వల్లే టీడీపీ గెలించిందనే విధంగా పవన్ మాట్లాడుతున్నారని... జనసేన, బీజేపీతో చేతులు కలపక ముందే మునిసిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని చెప్పారు. వాస్తవానికి ఆ పార్టీలతో కలవడం వల్ల, తమ ఓట్లు తగ్గిపోయాయని అన్నారు. మంత్రి లోకేష్ పై కూడా పవన్ కల్యాణ్ పసలేని ఆరోపణలు చేశారని... ఆ ఆరోపణలకు ఆయన వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

jaleel khan
Pawan Kalyan
Nara Lokesh
  • Loading...

More Telugu News