2018-19 budget: 2018-19 తెలంగాణ బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు... బడ్జెట్ వివరాలు - 1

  • రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
  • రాష్ట్ర ఆదాయం రూ. 73,451 కోట్లు
  • కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. సంక్షేమ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతుల మధ్య సమన్వయం కోసం... రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు.

బడ్జెట్ హైలైట్స్...

  • బడ్జెట్ - రూ. 1,74,453 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ. 1,25,454 కోట్లు
  • రాష్ట్ర ఆదాయం - రూ. 73,451 కోట్లు
  • కేంద్ర వాటా - రూ. 29,041 కోట్లు
  • రెవెన్యూ మిగులు - రూ. 5,520 కోట్లు
  • ద్రవ్యలోటు అంచనా - రూ. 29,077 కోట్లు

  • గత ఏడాది తలసరి ఆదాయం అంచనా - రూ. 1,75,534 కోట్లు
  • ఈ ఏడాది రాష్ట్ర జీడీపీ వృద్ధి అంచనా - 10.4 శాతం
  • సాగునీటి ప్రాజెక్టులకు - రూ. 25 వేల కోట్లు
  • కోల్డ్ స్టోరేజీ, లింకేజీలకు - రూ. 132 కోట్లు
  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు - రూ. 1000 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు - రూ. 5300 కోట్లు
  • ఆరోగ్య లక్ష్మి పథకానికి - రూ. 298 కోట్లు
  • హహిళా, శిశు సంక్షేమానికి - రూ. 1,799 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధికి - రూ. 9,693 కోట్లు
  • ఎస్సీ అభివృద్ధి శాఖకు - రూ. 12,709 కోట్లు
  • ఎస్టీల అభివృద్ధి శాఖకు - రూ. 8,063 కోట్లు
  • దళితుల భూ పంపిణీకి - రూ. 1,469 కోట్లు
  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు - రూ. 2,643 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి - రూ. 2వేల కోట్లు
  • అమ్మ బడి పథకానికి - రూ. 561 కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు - రూ. 15,563 కోట్లు

  • Loading...

More Telugu News