mohammmad shami: ఫామ్ హౌస్ వివాదం షమీ, హసీన్ మధ్య విభేదాలకు కారణమైందా?

  • మహ్మద్ షమీ, హసీన్ జహాన్ వివాదానికి కారణం తెలిపిన జాతీయ ఛానెల్
  • ఫాం హౌస్ కారణంగా చెలరేగిన వివాదం
  • ఫాం హౌస్ విలువ 12 నుంచి 15 కోట్ల రూపాయలు

టీమిండియా పేసర్‌ మహ్మద్ షమీ వివాదంలో రోజుకో విషయం వెలుగులోకి వచ్చి ఆసక్తి రేపుతోంది. షమీ దంపతుల మధ్య వివాదం ఫామ్ హౌస్ కారణంగా రేగిందని ఒక జాతీయ ఛానెల్ తెలిపింది. ఆ ఛానెల్ తెలిపిన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు ‘హసీన్‌ ఫామ్‌ హౌజ్‌’ ఉంది. పేరుకి ఈ ఫామ్ హౌస్ పేరుకే 'హసీన్ ఫామ్ హౌస్' కానీ దానికి సంబంధించిన పత్రాల్లో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేదని తెలిపింది. దాని విలువ 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొంది. షమీ భవిష్యత్ లో ఇక్కడే క్రికెట్ అకాడమీ నిర్మించాలని భావించాడని, ఈ నేపథ్యంలోనే వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని, ఆ విభేదాలు తీవ్ర రూపందాల్చి తీవ్ర ఆరోపణలు, కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయని, దీంతోనే షమీ కెరీర్ సందిగ్ధంలో పడిందని ఆ ఛానెల్ తెలిపింది.

mohammmad shami
haseen jahan
controversy
  • Loading...

More Telugu News