priya prakash vherrier: ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్

  • ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాలోని పాటలో హావభావాలతో ఆకట్టుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్
  • గులాబీ రంగు ఫ్రాక్ లో మెరిసిన ప్రియా ప్రకాశ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో షూట్ ఫోటోలు

‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమాలోని పాటలో ప్రదర్శించిన హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్‌ ఫోటో షూట్ తో మరోసారి మెస్మరైజ్ చేసింది. ఓర కంటి చూపుతో యువత గుండెకు గాలమేసిన ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గులాబి రంగు లాంగ్‌ ఫ్రాక్‌ లో మెరిసిన ప్రియా ప్రకాశ్ వారియర్ కు... ఈ ఫోటో షూట్ తరువాత మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆమె 'టెంపర్' రీమేక్ 'సింబా'లో రణ్ వీర్ సింగ్ సరసన ఎంపికైందన్న వార్త బీటౌన్ లో హల్ చల్ చేస్తోంది. మరోవైపు తెలుగులో మరో అవకాశాన్ని అంగీకరించిందని తెలుస్తోంది.

priya prakash vherrier
actress
photo shoot
  • Loading...

More Telugu News