Ayodhya: అయోధ్యలో రామమందిరం కేసులో 32 మధ్యంతర పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు

  • ఈ వివాదంలో ప్రత్యక్ష సంబంధం లేనివారి పిటిషన్ల కొట్టివేత
  • వాటిలో శ్యామ్ బెనెగల్, అపర్ణా సేన్, తీస్తా సెతల్వాద్, సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్లు
  • ప్రత్యక్ష సంబంధంగల పిటిషనర్ల వాదనలను మాత్రమే విచారిస్తామన్న సుప్రీంకోర్టు

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోన్న 'అయోధ్యలో రామ మందిరం లేక మసీదు నిర్మాణం కేసు' విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కక్షిదారులుగా చేరడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన 32 మధ్యంతర పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మొదటి నుంచి ఉన్న కక్షిదారులు మాత్రమే ఈ కేసులో వాదనలు వినిపించాలని, ఈ వివాదంలో ప్రత్యక్ష సంబంధం లేనివారు ఈ కేసులో జోక్యం చేసుకుంటామంటూ వేస్తోన్న వ్యాజ్యాలను స్వీకరించబోమని తేల్చి చెప్పింది.

తిరస్కరణకు గురైన పిటిషన్లలో శ్యామ్ బెనెగల్, అపర్ణా సేన్, తీస్తా సెతల్వాద్, సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్లు ఉన్నాయి. కాగా, అయోధ్య రామాలయంలో పూజలు చేసేందుకు తనకుగల ప్రాథమిక హక్కును అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రం తాము విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనితో పాటు ఈ వివాదంతో ప్రత్యక్ష సంబంధంగల పిటిషనర్ల వాదనలను మాత్రమే విచారిస్తామని తెలిపింది.

కాగా, అయోధ్య‌లోని 2.77 ఎకరాల భూమిపై గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు చెబుతూ సుప్రీంకోర్టులో మొదట్లో మొత్తం 13 పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.

  • Loading...

More Telugu News