chiranjeevi: అన్నయ్యా అని చిరంజీవి అంటే .. ఒరేయ్ అని నేను పిలిచేవాడిని: తమ్మారెడ్డి భరద్వాజ

  • చిరంజీవి .. నేను ఎంతో క్లోజ్ గా ఉండేవాళ్లం 
  • నన్ను ఎంతో ప్రేమగా పిలిచేవాడు 
  • నేను అంతే ఆత్మీయంగా పలకరించేవాడిని

గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. "చిరంజీవితో అనుబంధం ఉందిగానీ, చిరంజీవిగారితో అనుబంధం లేదు"అని అన్నారు. ఆ విషయాన్ని గురించిన ప్రశ్న ఆయనకి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. " చిరంజీవి .. నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. ఆయన నన్ను 'అన్నయ్యా' అంటే .. నేను 'ఒరేయ్' అని పిలిచేవాడిని.

అలాంటిది ఆయన అన్నయ్యా అనడం మానేశాడు .. దాంతో నేను ఒరేయ్ అనడం మానేశాను. సార్ .. అని అనాల్సి వచ్చింది .. అన్నాను కూడా. గతంలోని అనుబంధం బ్రేక్ అయిపోయినట్టే గదా .. ఆప్యాయతలు తగ్గిపోయినట్టే గదా. అన్నయ్యా అంటూ ఆయన వచ్చేవాడు .. ఎలా వున్నావ్ రా అంటూ ఒకళ్ల భుజాన ఒకళ్లం చేయివేసుకుని మాట్లాడుకునేవాళ్లం. అలాంటిది 'భరద్వాజ .. ఏంటి' అని ఆయన.. 'చిరంజీవి .. ఏంటి' అని నేను మాట్లాడుకునే స్థాయికి వచ్చాం. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడమే పోయింది" అంటూ చెప్పుకొచ్చారు.      

chiranjeevi
thammareddy bharadwaja
  • Loading...

More Telugu News