CPI Narayana: చంద్రబాబు, కేసీఆర్‌లపై సీపీఐ నారాయణ విమర్శలు

  • చంద్రబాబు బీజేపీకి భయపడుతున్నారు
  • ఎన్‌డీఏలో ఎందుకు కొనసాగుతున్నారు?
  • కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోంది
  • శాసనసభ నుంచి జానారెడ్డిని సస్పెండ్‌ చేయడం సరికాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీకి భయపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నుంచి తమ నేతలను తొలగించిన చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏలో మాత్రం ఎందుకు కొనసాగుతున్నారని ఆయన నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పక్షాలను కలుపుకుని పోరాడాలని ఆయన అన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా నారాయణ విమర్శలు చేశారు. ఆయన పాలన నిజాం పాలనను తలపిస్తోందని, శాసనసభ నుంచి జానారెడ్డిని సస్పెండ్‌ చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

CPI Narayana
Andhra Pradesh
KCR
Chandrababu
  • Loading...

More Telugu News