Twitter: ప్రధాని, రాహుల్ ట్విట్టర్ ఫాలోవర్లలో సగానికి పైగా నకిలీలే...!

  • నకిలీ ట్విట్టర్ ఫాలోవర్లలో మోదీని మించిపోయిన రాహుల్..!
  • 67 శాతంతో అగ్రస్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు
  • ట్రంప్‌ నకిలీ ఫాలోవర్లు 26 శాతమే

మనదేశంతో పాటు విదేశీ నేతలు, సెలబ్రిటీలను ట్విట్టర్‌‌లో ఫాలో చేస్తున్న వారిపై విడుదలయిన తాజా డేటా పలు ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేసింది. ఆ డేటా ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యధికంగా 67 శాతం నకిలీ ట్విట్టర్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాలను వరుసగా బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్, ప్రధాని నరేంద్ర మోదీ ఆక్రమించారు. వారందరికీ కూడా నిజమైన ఫాలోవర్ల కంటే నకిలీ ఫాలోవర్లే అధికంగా ఉన్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాస్తవిక ప్రపంచంలో పెద్దగా ప్రజాదరణ పొందలేకపోతున్నా సోషల్ మీడియాలో మాత్రం అసలు సిసలు ఫాలోవర్లను కలిగి ఉన్నారు. నకిలీ ఫాలోవర్ల విషయంలో ఆయన మన నేతల కంటే చాలా తక్కువగా అంటే 26 శాతం మాత్రమే కలిగి ఉండటం గమనార్హం.

Twitter
Rahul Gandhi
Narendra Modi
Sashi Tharoor
Amit shah
  • Loading...

More Telugu News