Undavalli: ఓటు హక్కు వచ్చింది... నవ్యాంధ్రలో ఉండవల్లి వాసులుగా చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి!
- ఇంటి నంబర్ 3-781/1లో ఓటర్లుగా నమోదు
- తాజా జాబితాలో అందరి పేర్లూ
- ఉండవల్లి వాసుల హర్షం
గుంటూరు జిల్లా ఉండవల్లి ఓటర్లుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కుటుంబం నమోదు పూర్తయింది. విభజన తరువాత నవ్యాంధ్రకు వచ్చి, ఉండవల్లి కరకట్టపై ఉన్న భవనాన్ని నివాసంగా మార్చుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడేపల్లి మండలం, ఉండవల్లిలో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు కూడా చేసుకుంది. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను ఇంటి నంబర్ 3-781/1లో ఉంటున్నట్టు నమోదు చేసి, ఓటరు లిస్టులోకి ఎక్కించారు. కాగా, సీఎం ఫ్యామిలీ తమ గ్రామంలో ఓటేయనున్నారని తెలుసుకున్న ఉండవల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.