Telangana: టీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం... వంశీచంద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి శాసన సభ్యత్వాలు కూడా రద్దు?

  • కెమెరా ఫుటేజ్ ని మరోసారి పరిశీలించిన స్పీకర్
  • ఇంకో ఇద్దరిపై వేటు వేసే అవకాశం
  • కాసేపట్లో అసెంబ్లీలో తీర్మానం!

రెండు రోజుల క్రితం తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న వేళ, అనుచితంగా ప్రవర్తించారంటూ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులపై అనూహ్యంగా శాసన సభ సభ్యత్వాల రద్దు శిక్షను విధించిన టీఆర్ఎస్ సర్కారు, తాజాగా మరో ఇద్దరిపైనా అదే తరహా శిక్ష విధించనున్నట్టు తెలుస్తోంది. సభలో కెమెరాల ఫుటేజ్ ని మరోసారి పరిశీలించిన స్పీకర్ మధుసూదనా చారి, కాంగ్రెస్ సభ్యులు వంశీచంద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా గవర్నర్ ను అవమానించారని భావించారని సమాచారం. దీంతో వారిద్దరి శాసన సభ్యత్వాలను కూడా రద్దు చేసేందుకు నిర్ణయించుకున్న సర్కారు, మరికాసేపట్లో అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమకు విధించిన శిక్షను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు గాంధీ భవన్ వద్ద చేస్తున్న దీక్ష రెండో రోజుకు చేరింది.

  • Loading...

More Telugu News