nara rohith: ఒక రకంగా సాహసమే .. మూగవాని పాత్రలో యంగ్ హీరో

  • నూతన దర్శకుడితో నారా రోహిత్ 
  • ఆయనకి ఇది 18వ సినిమా
  • చంద్రమోహన్ తరువాత నారా రోహితే

ఈమధ్య కాలంలో హీరోలు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. 'రాజా ది గ్రేట్' లో రవితేజ అంధునిగా .. 'రంగస్థలం' సినిమాలో చరణ్ వినికిడి లోపం గలవానిగా నటించారు. ఇక నారా రోహిత్ తన తాజా చిత్రంలో పూర్తిస్థాయి మూగవానిగా నటించనున్నాడనేది తాజా సమాచారం.

మంజునాథ్ అనే నూతన దర్శకుడితో అట్లూరి నారాయణరావు నిర్మించే సినిమాలో నారా రోహిత్ ఇలా కనిపించనున్నాడు. ఇది నారా రోహిత్ కి 18వ సినిమా. గతంలో 'సిరిసిరి మువ్వ' సినిమాలో చంద్రమోహన్ పూర్తిస్థాయి మూగవాని పాత్రలో నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకి నారా రోహిత్ ఆ తరహా పాత్రను పోషించనుండటం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News