Suryapet District: సూర్యాపేటలో విషాదం... రోడ్డుపై సిగపట్లు పట్టారు... పరువు పోయిందనుకుని ఆత్మహత్య చేసుకున్నారు!

  • చిన్న వివాదంతో రోడ్డుపై తన్నుకున్న మహిళలు
  • ఆపై ఇంటి పరువు తీశామన్న మనస్తాపం
  • పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి

ఓ చిన్న వివాదంలో రోడ్డుపై గొడవకు దిగి తన్నుకున్న ఇద్దరు మహిళలు, తమ పరువు పోయిందని భావించి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అర్వపల్లి మండలం ఉయ్యాలవాడలో గుట్టమ్మ, సరోజ అనే మహిళల మధ్య ఘర్షణ జరిగింది. వీరిద్దరూ నడిరోడ్డుపై సిగపట్లకు దిగారు. ఎవరు వారించినా వినలేదు. ఆపై బలవంతంగా వారిని విడదీసి ఇళ్లకు పంపారు. రోడ్డుపై కుటుంబం పరువును తీశామని భావించిన ఇద్దరు మహిళలూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గమనించి బంధువులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ ప్రారంభించారు.

Suryapet District
Arvapalli
Sucide
  • Loading...

More Telugu News