Sonia Gandhi: సోనియా విందులో కనిపించని టీడీపీ, టీఆర్ఎస్!

  • విపక్ష పార్టీలకు విందు ఇచ్చిన సోనియా
  • టీడీపీ, టీఆర్ఎస్ లను పిలవలేదు
  • వెల్లడించిన కాంగ్రెస్ వర్గాలు

గత రాత్రి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ విపక్ష పార్టీల నేతలకు ప్రత్యేక విందు ఇచ్చిన వేళ తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల ప్రతినిధులు కనిపించలేదు. వాస్తవానికి ఈ విందుకు టీడీపీ హాజరవుతుందని గతవారం వార్తలు వచ్చాయి. అయితే, గతంలో యూపీఏలో భాగంగా ఉన్న పార్టీలకు మాత్రమే ఆహ్వానాలు పంపామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. టీడీపీతో పాటు టీఆర్ఎస్ కు కూడా ఆహ్వానాన్ని పంపలేదని తెలిపాయి. ఇక టీఆర్ఎస్ ను ఆహ్వానించాలని తొలుత భావించినా, తాను ముందుండి తృతీయ కూటమిని నడిపిస్తానని కీలక ప్రకటన చేసిన కేసీఆర్ ను, ఈ విందుకు ఆహ్వానించడం తగదని కాంగ్రెస్ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అన్ని పార్టీలనూ కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ విందు జరిగినప్పటికీ, ఇదేమీ రాజకీయ విందు కాదని కాంగ్రెస్ వెల్లడించడం గమనార్హం.

Sonia Gandhi
Dinner
New Delhi
Telugudesam
TRS
  • Loading...

More Telugu News