rajanikanth: నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే ఆథ్యాత్మిక బాట పట్టాను: రజనీకాంత్

  • మనిషి జీవిత లక్ష్యం... తనను తాను తెలుసుకోవడమే 
  • నేను అదే ప్రయత్నంలో ఉన్నాను
  • నేనింకా పూర్తి రాజకీయవేత్తను కాలేదు

నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే నేను ఆథ్యాత్మిక బాట పట్టానని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తెలిపారు. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లోని దయానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ, మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమేనని అన్నారు. తాను ఆ ప్రయత్నంలోనే ఉన్నానని ఆయన చెప్పారు. తానింకా పూర్తి స్థాయి రాజకీయవేత్తను కాలేదని అన్నారు. కనీసం రాజకీయ పార్టీ పేరును కూడా ప్రకటించలేదని ఆయన గుర్తుచేశారు. ఆశ్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్న ఆయన, ఈ ఆశ్రమానికి రావడం ఇదే తొలిసారి కాదని, గతంలో చాలా సార్లు తానీ ఆశ్రమానికి వచ్చానని అన్నారు. తేని జిల్లాలో కార్చిచ్చు ధాటికి ట్రెక్కర్లు సజీవ దహనం కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

rajanikanth
tamil super star
talaiva
  • Loading...

More Telugu News