dasari: దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు సెట్లో అలా ఉండేవారు: జయసుధ

  • రాఘవేంద్రరావు గారి సెట్లో సరదాగా ఉండేది 
  • షూటింగ్ మొదలైతే సీరియస్ గా ఉండేవారు 
  • ఆలస్యంగా వస్తే దాసరి గారు అరిచేసేవారు

తెలుగు తెరపై అల్లరి అమ్మాయిగా .. గడసరి అమ్మాయిగానే కాదు, బరువైన పాత్రలను పోషించడంలోను జయసుధ తనకి తిరుగులేదనిపించుకున్నారు. దాసరి నారాయణ రావు .. రాఘవేంద్రరావుల దర్శకత్వంలో ఆమె ఎక్కువ హిట్ చిత్రాల్లో నటించారు. అలాంటి జయసుధ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ఆ దర్శకులను గురించి ప్రస్తావించారు.

" దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు ఇద్దరివి కూడా వేరు వేరు స్కూల్స్. రాఘవేంద్రరావుగారు ఉదయం 7 గంటలకి షూటింగ్ కి వచ్చేవారు .. సాయంత్రం 6 గంటలకి పేకప్ చెప్పేవారు. సెట్ లో అంతా సరదాగా నవ్వుతూ ఉండొచ్చు ..  షూటింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఆయన చాలా సీరియస్ గా ఉండేవారు. ఇక దాసరి గారి విషయానికి వస్తే, ఎవరైనా ఒక అయిదు నిమిషాలు లేట్ గా వచ్చినా తిట్టేసేవారు. సెట్లో పేకాడటం .. జోకులేయడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం ఉండేవి కావు" అంటూ చెప్పుకొచ్చారు.    

dasari
raghavendra rao
  • Loading...

More Telugu News