Mahesh Babu: మా అమ్మాయి సితార మా అమ్మలాగే ఉంది : సూపర్‌స్టార్ మహేశ్ బాబు

  • ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు సితార ఫొటో అప్‌లోడ్
  • 15 గంటల్లోనే 1.08 లక్షల లైక్‌లు
  • భరత్ అనే నేను ఏప్రిల్ 20న రిలీజ్‌కు సన్నాహాలు

సినిమా షూటింగ్‌ల నుంచి విరామం దొరికినప్పుడల్లా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యామిలీతో ఎక్కువగా గడుపుతుంటారు. భార్య నమ్రతతో పాటు తన ఇద్దరు పిల్లలతో సరదాగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు సితార అచ్చం తన అమ్మ ఇందిరాదేవిలాగే ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

 'పింగ్ గర్ల్ పవర్...చూడటానికి అచ్చం మా అమ్మలాగే ఉంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోని పోస్టు చేశారు. ఈ ఫొటో పెట్టిన 15 గంటల్లోనే 1.08 లక్షల మంది దానిని లైక్ చేశారు. నిజంగానే సితార మహేశ్ అమ్మగారి లాగే ఉందంటూ వారు కామెంట్లు పోస్ట్ చేశారు. మహేశ్ ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో మనకందరికీ తెలిసిందే. భరత్ అనే నేను చిత్రాన్ని వచ్చే నెల 20న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Mahesh Babu
Sitara
Instagram
Bharath Ane Nenu
  • Loading...

More Telugu News