puri: ఆర్ధికంగా స్థిరపడలేదు .. అయినా పూరీ అడిగినా చేయలేదు: అనూప్ రూబెన్స్
- కీ బోర్డు ప్లేయర్ గా చేసేవాడిని
- ఆ సమయంలో పూరీ ఛాన్స్ ఇచ్చారు
- అయినా అందుకే ధైర్యం చేయలేదు
తెలుగులోని యువ సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ .. తమన్ తరువాత వినిపించే పేరు అనూప్ రూబెన్స్. యూత్ కి కనెక్ట్ అయ్యే పాటలను .. హృదయాలకి హత్తుకునే బాణీలను అందించడం ఆయన ప్రత్యేకత. అలాంటి అనూప్ రూబెన్స్ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నారు.
"కీ బోర్డు ప్లేయర్ గా నేను అప్పుడప్పుడే సెటిల్ అవుతున్నాను. ఒక కాల్షీట్ లో కీ బోర్డు ప్లేయర్ గా చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఆ సినిమా ఫ్లాపా .. హిట్టా అనే విషయంతో సంబంధం ఉండదు. కీ బోర్డు ప్లేయర్ గా నాకు హయ్యెస్ట్ పేమెంట్ ఉండేది .. అలా నా లైఫ్ సాగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ ను అయితే, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నన్ను పిలవరు. దాంతో నా వర్క్ అంతా పోతుంది. అందువలన కొంచెం సెటిల్ అయినా తరువాత రిస్క్ చేద్దామని ఆగిపోయాను. ఆ సమయంలో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' .. 'ఇడియట్' సినిమాలకి చేయమని పూరీ అడిగారు. కానీ చెప్పాను కదా .. నాకున్న భయాల కారణంగా ఆ సినిమాలు చేయలేదు " అని చెప్పుకొచ్చాడు.